లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం.. ప్రభుత్వ కీలక నిర్ణయం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 2020 లో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 25 లక్షలకుపైగా దరకాస్తులుఅందాయి. ఈ మూడున్నరేళ్ల నిరీక్షణకు ఫలితంగా దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్‌లను క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. మార్చి 31లోపు మొత్తం రుసుం చెల్లించిన ప్లాట్ల క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్‌లను క్రమబద్దీకరించనున్నారు. గతంలో రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు.