వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఎపికి చెందిన ఏడుగురు మృతి

అమరావతి () వేర్వేరు ప్రదేశాలలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఎపికి చెందిన ఏడుగురు మృతి చెందారు. కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. విశాఖ నుండి రాజమహేంద్రవరం వెళుతున్న ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. లారీ మరమ్మతుల చేస్తున్న సిబ్బందితో పాటు అటుగా వెళ్తున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
కర్నూలుకు చెందిన ముగ్గురు మిర్చి రైతులు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని దవాణగెరి వద్ద మిర్చి లోడ్‌తో ఉన్న టెంపో వాహనం టైర్ పంక్చర్ అవడంతో అదుపు తప్పి ప్రమాదం జరిగింది.