టిడిపిలోకి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
మరో రెండ్రోజుల్లో టిడిపిలో చేరనున్న మైలవరం ఎమ్మెల్యే

విజయవాడ (CLiC2NEWS): ఎమ్మెల్యే పార్ధసారథి టిడిపి కండువా కప్పుకున్నారు. వైఎస్ ఆర్సిపికి రాజీనామా చేసిన ఆయన లోకేశ్ సమక్షంలో టిడిపిలో చేరారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో అవసరమని.. వెఎస్ ఆర్సిపి విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశ్యంతో పార్టిని వీడినట్లు తెలిపారు. బలహీనవర్గాలకు వెఎస్ ఆర్సిపిలో అడుగడుగునా అవమానాలేనని.. బిసి, ఎస్సి, ఎస్టిలకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదన్నారు. నూజివీడులో అందరితో కలిసివెళ్తు.. టిడిపి జెండా ఎగురవేస్తానని తెలిపారు.
మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రెండ్రోజుల్లో టిడిపిలో చేరతానని ప్రకటించారు.