క‌ల్కి 2898 AD టైటిల్ పెట్టింది అందుకే.. నాగ్ అశ్విన్‌

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం క‌ల్కి 2898 ఎడి. ఈ సినిమాపై సినీ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా దీపికా ప‌దుకొణె న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా దిశాప‌టాని, అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ కూడా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు అశ్విన్ క‌ల్కి టైటిల్ పెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని తెలిపారు. క‌ల్కి చిత్రం మ‌హాభార‌తం కాలం నుండి మొద‌లై 2898తో పూర్త‌వుతుంది. గ‌తంలో ప్రారంభై భ‌విష్య‌త్తుతో ముగుస్తుంద‌ని, అందుకే ఈ టైటిల్ పెట్టిన‌ట్లు తెలిపారు. దీనిలో మొత్తం 6,000 సంవ‌త్స‌రాల మ‌ధ్య జ‌రిగే క‌థ‌ను చూపిస్తున్న‌ట్లు.. దానికి త‌గ్గ ఓ ప్ర‌పంచాన్ని సృష్టించామ‌న్నారు. అన్నిట్లో భార‌తీయ‌త క‌నించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌న్నారు. ఈ చిత్రం మే 9వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా 22 భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సామాచ‌రం

Leave A Reply

Your email address will not be published.