రూ. 500కే గ్యాస్ సిలిండర్..
మరో రెండు గ్యారెంటీలు అమలు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి లో మరో హామీని అమలు చేసేందుకు జిఒ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలును ప్రారంభించారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 500 కే గ్యాస్ సిలిండర్ , గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు. ఎన్ని ఇబ్బందులున్న ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని సిఎం స్ఫష్టం చేశార. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్ కార్డు దారులకు రూ. 500కే సిలిండర్ ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని.. లబ్ధిదారులకు సబ్సిడి డబ్బు గ్యాస్ కంపెనీలు బదిలీ చేస్తాయన్నారు. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు.