రావుల‌పాలెం స‌మీపంలో యువ ఫోటోగ్రాఫ‌ర్ హ‌త్య‌!

మ‌ధుర‌వాడ (CLiC2NEWS): రావుల పాలెం స‌మీపంలో ఓ యువ ఫోటోగ్రాఫ‌ర్ హ‌త్యుకు గురైన విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మ‌ధుర‌వాడ బ‌క్క‌న్న పాలెంకు చెందిన పోతిన సాయికుమ‌రా్ వివాహ వేడుక‌ల‌కు ఫోటోలు, వీడియోలు చిత్రీక‌ర‌ణ చేస్తుండేవాడు. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్‌లు తీసుకొని స్థానిక ప్రాంతాల‌తో పాటు దూర ప్రాంతాల ఈవెంట్‌ల‌కు వెళ్తుంటాడు.

అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా రావుల‌పాలెం ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌ది రోజుల ఫోటోషూట్ ఉందని చెప్పి ఫిబ్ర‌వ‌రి 26న సాయికుమార్‌ను పిలిచారు. సాయికుమార్ రూ. 15 ల‌క్ష‌ల విలువైన కెమెరా సామాగ్రితో బ‌య‌లుదేరాడు. ఆ ఇద్ద‌రు యువ‌కులు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుండి కారులో సాయిని తీసుకెళ్లారు. అక్క‌డ సాయికుమార్‌ని హ‌త్య చేసి పూడ్చి పెట్టారు.పెళ్లి ఫోటో షూట్‌కు వెళ్లిన త‌మ కుమారుడు మూడు రోజులుగా ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు విశాఖ‌లోని పిఎంపాలెం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. నిందితుల్లో ఒక‌రైన ష‌ణ్ముఖ‌తేజ‌ను అదుపులోకి తీసుకున్నారు. కెమెరా, సామాగ్రి కేస‌మే సాయిని హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. మ‌రో నిందితుడు ప‌రారీలో ఉన్నాడు.

Leave A Reply

Your email address will not be published.