సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే..
30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. రాహుల్ గాంధీ

జైపుర్ (CLiC2NEWS): రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ్‌యాత్ర రాజస్థాన్‌లోకి చేరుకోగా.. బాన్స్‌వారలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అంతే కాకుండా దేశంలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ద హామీ కల్పిస్తామన్నారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. స్టార్టప్‌ల కోసం రూ.5 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పంపిణీ చేస్తామన్నారు. ఇది యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఉపయోగపడుతుందన్నారు.