రూ. 2 వేల కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో సీనీ నిర్మాత అరెస్ట్

రూ. 2 వేల కోట్ల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు సూత్రధారి అయిన సినీ నిర్మాతను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. భారత్, ఆస్ట్రేలియా, న్యాజిలాండ్ దేశాల మధ్య డ్రగ్స్ రవాణాలో ప్రధాన సూత్రధారి తమిళ సినీ నిర్మాత, డిఎంకె మాజి సభ్యుడు జాఫర్ సాదిక్ ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. జాఫర్ కోలీవుడ్‌లో నాలుగు చిత్రాలను నిర్మించాడు. అంతేకాకుండా రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు.
డిఎంకె ఎన్ ఆర్ ఐ విభాగానికి ఆఫీస్ బేరర్‌గా పనిచేశాడు. డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవడంతో డిఎంకె అతడిని పార్టీ నుండి బహిష్కరించింది. మరోవైపు గత నలుగు నెలలు నుండి పరారీలో ఉన్న జాఫర్‌ను ఎన్‌సిబి అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడులో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మదురైలో కొందరు రైల్వే ప్రయాణికుల వద్ద , చైన్నైలోని ఓ డంప్ యార్డ్‌లో రూ. 180 కోట్ల డ్రగ్స్‌ను గుర్తించారు. వీటిని శ్రీలంకకు స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో అంతర్జాతీయ డ్రగ్స్ దందా బయటపడింది. ఈ నెట్వర్క వెను జాఫర్ సాదిక్ ఉన్నట్లు సమాచారం.