మార్చి 12న మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు: భట్టి విక్రమార్క

హైదరాబాద్ (CLiC2NEWS): గత ప్రభుత్వం స్వయం సహాయక బృందాలను నిర్వీర్యం చేసిందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎపుడూ కూడా నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మర్చి 1న జీతాలు ఇచ్చామన్నారు. అంతేకాకా స్వయం సహాయక బృందాలను కూడా నిర్వీర్యం చేసిందని.. ప్రస్తుత తమ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన మహిలా సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. దీని ద్వారా సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళకు అవకాశం కల్పిస్తామన్నారు.