అనుమానాస్పదంగా ఇద్దరు చిన్నారుల మృతి.. పరారీలో భార్యాభర్తలు!

గార్ల (CLiC2NEWS): మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్న గూడెంలో అనుమానాస్పదంగా ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. చిన్నారుల తల్లిదండ్రులు పరారీలో ఉన్నట్లు సమాచారం. చిన్నారులు తాగిన పాలలో విషం కలిసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం మండలం నామాలపాడులో ఉంటున్న అనిల్, దేవి దంపతులకు మూడూళ్ల లోహిత, ఏడాది వయస్సున్న జశ్విత.. ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అనిల్ తమ స్వంత ఊరు అంకన్నగూడెంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వారం రోజుల క్రితం కుటంబంతో సహా వచ్చాడు. ఆదివారం తెల్లవారు జామున అనిల్ తండ్రి బయటకు వెళ్లి వచ్చే సరికి చిన్నారులు విగత జీవులుగా పడిఉన్నారు. కానీ ఆ ప్రదేశంలో ఎక్కడాకూడా కొడుకు,కోడలు కనిపించలేదు. దీంతో పోలీసులుకు సమాచారం అందించారు.