ప్రాణ‌హాని ఉంది, ర‌క్ష‌ణ క‌ల్పించండి: ద‌స్త‌గిరి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎపి మాజి మంత్రి వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి.. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ కోరుతూ సిబిఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న కుటుంబానికి ఎపి సిఎం జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి ఆయ‌న కుమారుడు చైత‌న్య రెడ్డి నుండి ప్రాణ హాని ఉంద‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సిబిఐ త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. దీనిపై మంగళ‌వారం సిబిఐ కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

Leave A Reply

Your email address will not be published.