టిఎస్ఆర్టిసి లో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులు..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో మరో 22 ఎలక్ట్రిక్ బస్సులు. నక్లెస్ రోడ్డులో మంత్రులు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నట్లు సమాచారం. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వీటిని తెస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సులు నగరంలోని అన్ని ప్రారంతాలకు నడవనున్నాయని, వీటిలో మహిళలకు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు.
ఆర్టిసి కొత్తగా 565 డీజిల్ బస్సులు తీసుకురానుంది. ఇవి జూన్ నెలలో అందుబాటులోకి రానున్నాయి. మరో 440 బస్సులు.. 300 మెట్రో, 140 ఆర్డినరీ. వీటన్నిటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.