ఎపి కాస్తూర్భాగాంధీ విద్యాల‌యాల్లో ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌స్తూర్భాగాందీ విద్యాల‌యాల్లో 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి 6,11 త‌ర‌గ‌తుల‌లో ప్ర‌వేశాలుకు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. 7,8,9 త‌ర‌గ‌తుల్లో మిగిలిన సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటి కోసం నేటి నుండి ఏప్రిల్ 11 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. అనాథ‌లు, బ‌డి బ‌య‌ట పిల్ల‌లు, డ్ర‌పౌట్స్‌,పేద ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టి వ‌ర్గాల‌కు చెందిన బాలిక‌లు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.2 ల‌క్ష‌లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రూ. 1.4 ల‌క్ష‌లు మించ‌రాదు. ఎపిలో స‌మగ్ర శిక్ష ఆధ్వ‌ర్యంలో మొత్తం 352 కెజిబివిలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.