విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్..

విశాఖ (CLiC2NEWS): విశాఖ తీరంలో 25వేల కిలోల డ్రగ్స్ ఉన్న కంటైనర్‌ను పోలీసులు గుర్తించారు. బ్రెజిల్ నుండి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్‌కు వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ కంటైనర్ జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈనెల 16వ తేదీన విశాఖకు చేరుకుంది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఢిల్లీ సిబిఐ, విశాఖలోని సిబిఐ, కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆపరేషన్ గరుడలో భాగంగా వెంటనే ప్రత్యేక బృందాలను పంపారు. ఈనెల 19వ తేదీన నార్కొటిక్స్ సామాగ్రి, నిపుణులతో వచ్చిన సిబిఐ డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే డ్రగ్స్‌ను సీజ్ చేశారు.