టెట్ దరఖాస్తు రుసుములు పెంపు..
ఒక పేపర్ రాస్తే రూ. వెయ్యి, రెండు పేపర్లకు రూ. 2వేలు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఈనెల 15న నోటిఫికేషన్ విడుదలైంది. 27వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుమును విద్యాశాఖ భారీగా పెంచింది. గతంలో ఒక పేపర్ రాస్తే రూ. 200 ఉండగా రూ. వెయ్యి కి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ. 300 ఉండగా.. దాన్ని రూ. 2వేలకు పెంచింది.
మే 20 వ తేదీ నుండి జూన్ మూడో తేదీ వరకు టెట్ పరీక్షను నిర్వహిస్తారు. మే 15 నుండి హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేపర్-1 ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 వరకు జరుగుతుంది. అభ్యర్థులు పేపర్-1 పరీక్ష రాయాలనుకుంటే రూ. వెయ్యి.. రెండు పేపర్లు రాయాలంటే రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదలవుతాయి.