వార్ధా నదిలో మునిగి నలుగురు యువకులు మృతి

ఆసిఫాబాద్ (CLiC2NEWS): నదిలో మునిగి నలుగురు యవకులు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. హోలీ ఆడిన తర్వాత నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నలుగురు మృత దేహాలను వెలికితీశారు. మృతలందరూ నదీమాబాద్కు చెందిన సంతోష్, కమలాకర్, ప్రవీణ్, సాయిగా గుర్తించారు.