కాంగ్రెస్ గూటికి క‌డియం శ్రీ‌హ‌రి, కావ్య‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఆర్ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి, ఆయ‌న కుమార్తె ముఖ్య‌మంత్రి కెసిఆర్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దీప‌దాస్ మున్షి వారికి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. క‌డియం కావ్యకు బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ వ‌రంగ‌ల్ లోక్‌స‌భ టికెట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆమె పార్టీ నుండి పోటీ చేసే ఉద్దేశం లేదంటూ నిరాక‌రించారు. ఈ క్ర‌మంలో నేడు కాంగ్రెస్ పార్టీ చేరారు. మ‌రోవైపు రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.కె (కేశ‌వ‌రావు), ఆయ‌న కుమార్తె జిహెచ్ ఎంసి మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి శ‌నివారం కాంగ్రెస్‌లో చేరారు.

Leave A Reply

Your email address will not be published.