కాకినాడ జిల్లాలో ఖాళీ ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి

శంఖవరం (CLiC2NEWS): కాకినాడ జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి శివారు ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరమ్మతుల కోసం ట్యాంకర్ను తీసుకొచ్చినట్లు సమాచారం. వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారగా ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో కొచ్చెర్ల ప్రభాకర్, బూరా సోమరాజు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మరణించినవారు కత్తిపూడికి చెందినవారుగా తెలిపారు. వేడి తీవ్రతకు ట్యాంకర్ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలలో విషాదం నెలకొంది.