నేర,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం ‘ఆపరేషన్ గరుడ’

పెద్దపల్లి (CLiC2NEWS): పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రామగుండం సిపి ఎం. శ్రీనివాస్ ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తుల నిర్మూలనకు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడ ప్రారంభించినట్లు తెలియజేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పట్టణంను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడం తక్కువ సమయం లో డ్రోన్ ద్వారా సాధ్యం అవుతుందన్నారు.
ఎవరైనా గొడవలకు పాల్పడిన, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వీడియోలు, ఫోటోల ఆధారాలతో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిపి తెలిపారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ఉండెదుకు ‘ఆపరేషన్ గరుడ’ పేరిట డ్రోన్లతో పెట్రోలింగ్ నిర్వహించి ప్రత్యేక నిఘా ఉంటుందని భవిష్యత్తు లో కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, పెద్దపల్లి ఏసిపి కృష్ణ , సీఐ కృష్ణ,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ లు లక్ష్మణ్‌రావు, మల్లేష్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.