మట్టి ట్రక్కు బోల్తాపడి ఇద్దరు యువతులు, యువకుడు మృతి
హుజూరాబాద్ (CLiC2NEWS): హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో టిప్పర్ లారీ బోల్తాపడి అందులో ఉన్న మట్టి మీదపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. ట్రక్కులో ఉన్న మట్టి బైక్‌పై ప్రయాణిస్తున్న వారిపై పడింది. బైక్‌పై ఉన్న విజయ్, సింధుజ, వర్ష ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందులూ మృతిచెందారు. వీరంతా బోర్నపల్లికి చెందినవారుగా గుర్తించారు. వీరు పెద్దమ్మ జాతరకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.