రేపు 102 స్థానాలకు తొలి దశ పోలింగ్..

Elections: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. 21 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పొలింగ్ జరగనుంది. దీంతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 102 స్థానాలకు గాను మొత్తం 1625 మంఇ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 16 కోట్ల మంది ఓటర్లు ఉండగా..వీరిలో 35 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.