నూత‌న నావికాద‌ళాధిప‌తిగా వైస్ అడ్మిర‌ల్ దినేశ్ త్రిపాఠి

ఢిల్లీ (CLiC2NEWS): నూత‌న నావికా ద‌ళాధిప‌తిగా వైస్ అడ్మిర‌ల్ దినేశ్ కుమార్ త్రిపాఠి బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు. ప్ర‌స్తుతం ఆ హోదాలో ఉన్న అడ్మిర‌ల్ ఆర్‌. హ‌రి కుమార్ ఏప్రిల్ 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దినేశ్ త్రిపాఠి ప్ర‌స్తుతం భార‌త నావికాద‌ళ వైస్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

1985లో భార‌త నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అడుగుపెట్టిన ఆయ‌న వివిధ హోదాల్లో ప‌నిచేశారు. వెస్ట‌ర్న్ నావ‌ల్ క‌మాండ్‌కు ఫ్లాగ్ ఆఫాస‌ర్ క‌మాండింగ్ ఇన్ చీఫ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఐఎన్ ఎస్ వినాశ్‌ను క‌మాండ్ చేసిన అనుభ‌వ‌మూ ఉంది. వెస్ట‌ర్న్ ప్లీట్‌కు ఆప‌రేష‌ణ్స్ ఆఫీస‌ర్‌, నావ‌ల్ ఆప‌రేషన్స్‌కు డైరెక్ట‌ర్, నెట్‌వ‌ర్క్ సెంట్రిక్ ఆప‌రేష‌న్స్‌కు ప్ర‌ధాన డైరెక్ట‌ర్‌, ఢిల్లీలోని నావ‌ల్ ప్లాన్స్‌కు ప్ర‌ధాన డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. ప్ర‌ఖ్యాత ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మికి క‌మాండంట్‌గానూ సేవ‌లందించారు.

Leave A Reply

Your email address will not be published.