ఎపి ఎడ్‌సెట్ – 2024 నోటిఫికేషన్
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/EdCET.jpg)
EdCET – 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఇడి, బిఇడి (స్పెషల్ ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ ను ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (APSCHE) విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బిటెక్, బిసిఎ, బిబిఎం విద్యార్థులూ కూడా అర్హులే. దరాఖాస్తులను ఆన్‌లైన్‌లో మే 15వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష జూన్ 8వ తేదీన నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్‌సి , ఎస్‌టి అభ్యర్థులు రూ. 450, బిసి లు రూ. 500 ఒసిలు రూ. 650 చెల్లించాలి.