AP: రేపు పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల
అమరావతి (CLiC2NEWS): ఎపిలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి,. విద్యా కమిషనర్ సురేష్ కుమార్ సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. గత నెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు మొత్తం 3,473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారు.