నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పిహెచ్‌డి: యుజిసి ఛైర్మ‌న్

ఢిల్లీ (CLiC2NEWS): పిహెచ్‌డి చేయాల‌నుకునే విద్యార్థుల‌కు శుభ‌వార్త.  యుజిసి నెట్ (జూన్‌) సెష‌న్ ప‌రీక్ష‌లో కొత్త విధానాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు యూనివ‌ర్సిటి గ్రాంట్స్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ జ‌గ‌దీశ్ కుమార్ తెలిపారు. నాలుగేళ్ల పాటు అండ‌ర్ గ్యాడ్యుయేష‌న్ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇక నుండి నేరుగా యుజిసి నెట్ ప‌రీక్ష రేసేందుకు అర్హుల‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేసి .. 55% మార్కులు ఉన్న అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే నెట్‌కు అర్హులుగా ప‌రిగ‌ణించేవారు. ఇక నుండి నాలుగేళ్ల డిగ్రీలో క‌నీసం 75% మార్కులు లేదా త‌త్స‌మాన గ్రేడ్‌లు ఉంటే.. పిహెచ్‌డి చేయ‌వ‌చ్చ‌న్నారు. జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) ఉన్నా.. లేక‌పోయినా పిహెచ్‌డి అభ్య‌సించేందుకు అర్హ‌లని పేర్కొన్నారు.

అభ్య‌ర్థులు డిగ్రీలో స‌బ్జెక్టుల‌తో సంబంధం లేకుండా తాము ఎంచున్న అంశాల్లో పిహెచ్‌డి చేయ‌వ‌చ్చు. దీనికోసం వారు నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్ట‌ర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌ల‌లో 75% మార్కులు సాధించాల్సి ఉంటుంది. చివ‌రి సెమిస్ట‌ర్ లో ఉన్న విద్యార్థులు సైతం యుజిసి నెట్ (జూన్ సెష‌న్‌)కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. శ‌నివారం నుండి ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మ‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.