TS: ఇంటర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS) : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మార్చి 10 నుండి మూల్యంకనం ప్రారంభించారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ 30 లేదీ మే 1వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.