కోదాడ జాతీయ రహదారీపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

కోదాడ (CLiC2NEWS): ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని జాతీయ రాహదారిపై చోటుచోసుకుంది. ఆగివున్న లారీని కారు వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా కోదాడ మండలం చిమిర్యాలకు చెందినవారు. హైదరాబాద్లో నివాసముంటున్నారు. చిన్నారికి చెవులు కుట్టించే నిమిత్తం గురువారం విజయవాడకు వెళ్తుండగా.. ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నట్లు సమాచారం.