రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య!
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
సిరిసిల్ల (CLiC2NEWS): ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలంలో అంకారపు మల్లేశం, సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్కు చెందిన ఆడిచర్ల కైలాసం.. నెల రోజులుగా పనిలేక పోవడంతో ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో , కుటుంబ పోషణ భారంగా మారి తీవ్ర మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అంకారపు మల్లేశంకు భార్య భారతి, కుమారుడు, మహేశ్, కూతరు మనీషా ఉన్నారు.
ఆడిచర్ల సాయి వార్పిన్కు తల్లిదండ్రులు కైలాసం, పద్మ ఉన్నారు. కైలాసం పక్షవాతంతో బాధపడుతున్నారు. తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. సాయి కార్మికడిగా పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉండేవాడు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.