జనసేనానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్న వరుణ్ తేజ్ ..
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/Varun-Tej.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతుగా సినీనటుడు వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఆది, గెటప్ శ్రీను, జాని మాస్టర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా వరుణ్ పిఠాపురం నియోజక వర్గంలో ప్రచారం చేయనున్నట్లు పార్టి ప్రకటన విడుదల చేసింది. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు వరుణ్ తేజ్ ప్రచారం ప్రారంభం కానుంది. వన్నెపూడి మీదుగా చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనున్నట్లు సమాచారం.