కేంద్ర మంత్రి అమిత్‌షాకు త్రుటిలో తప్పిన ప్రమాదం
పట్నా (CLiC2NEWS): కేంద్ర మంత్రి అమిత్‌షాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి గాలిలో ఊగిసలాడింది. ఒక సారి నేలకు తాకబోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను కంట్రోల్‌లోకి తెచ్చారు. దీంతో ప్రమాదం తప్పింది. బిహార్‌లోని బెగుసరయ్‌లో అమిత్‌షా ఎన్నికల ర్యాలి ముగిసిన అనంతరం హెలికాప్టర్‌లో బయలు దేరారు. అది టేకాఫ్ అవుతుండగా నియంత్రణ కోల్పోయింది. దీనికి సంబంధించిన దృశ్యాఉల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గత నెల 21న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లోని ఎన్నికల ప్రచారంకు వెళ్లాల్సి ఉండగా.. అమిత్‌షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతరం కారణంగా కిందకు దిగలేకపోయారు. దీంతో ఆ పర్యటన రద్దు చేశారు.