కెసిఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారం 48 గంట‌ల పాటు నిషేధం.. ఇసి

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌కుండా 48 గంట‌ల పాటు ఇసి నిషేధం విధించింది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి పూర్తి విరుధ్దంగా కెసిఆర్ వ్యాఖ్య‌లు చేశార‌ని .. 48 గంట‌ల‌పాటు ప్రచారం చేయ‌కూడ‌ద‌ని నిషేధం విధించింది. ఈ నెల 5వ తేదీన సిరిసిల్ల‌లో నిర్వ‌హించిన బిఆర్ ఎస్ మీడియా స‌మావేశంలో కెసిఆర్ కాంగ్రెస్ పార్టిపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌ని కాంగ్రెస్ నేత నిరంజ‌న్ రెడ్డి ఇసికి ఫిర్యాదు చేశారు. విచార‌ణ చేప‌ట్టిన ఎన్నిక‌ల సంఘం కెసిఆర్ నుండి వివ‌ర‌ణ తీసుకంది. తెలంగాణ మాండ‌లికాన్ని పూర్తి స్థాయిలో ఆర్ధం చేసుకోలేక పోయార‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెంద‌ని ఇసి.. కెసిఆర్ ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని భావించి.. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుండి 48 గంట‌ల పాటు లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌ని స్ఫ‌ష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.