పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , నార్తర్న్ స్పోర్ట్స్ కోటా గ్రూప్-డి 38 పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. పుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డి, రెజ్లింగ్, చెస్ వంటి క్రీడాంశాలలో వివిధ స్థాయిల్లో ప్రతిభ చూపాలి. పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 01.07.2024 నాటికి 25 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు రుసుం రూ. 500.. ఎస్సి, ఎస్టి, మహిళలు, ఇబిసి, మైనారిటీలకు రూ. 250గా నిర్ణయించారు.
01.042021 నుండి వివిధ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నవారు అర్హులు. వీటికి అంతర్జాతీయ , జాతీయ, రాష్ట్ర స్పోర్ట్స్ ఫెడరేషన్, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ గుర్తింపు ఉండాలి. కేటగిరి సి ఛాంపియన్షిప్స్/ ఈవెంట్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలి. లేదా ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్స్లో (సీనియర్ కేటగిరి) కనీసం మూడో స్థానం పొందాలి. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 16.