తెనాలి ఘ‌ట‌న.. ఇసి ఆగ్ర‌హం

తెనాలి (CLiC2NEWS): తెనాలి వైఎస్ ఆర్ అభ్య‌ర్థి అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌పై ఇసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆయ‌న్ని అదుపులోకి తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. పోలింగ్ కేంద్రంలో శివ‌కుమార్ క్యూలైన్‌లో వెళ్లక‌పోవ‌డంతో అభ్యంత‌రం తెలిపిన ఓట‌రుపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆ ఓట‌రు కూడా శివ‌కుమార్‌ని చెంప‌పై కొట్టాడు. అనంత‌రం శివ‌కుమార్ అనుచరులు ఓట‌రుపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి దిగారు. ఈ ఘ‌ట‌న ఎన్నిక‌ల సంఘం దృష్టికి వెళ్ల‌గా.. పోలింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు శివ‌కుమార్‌ను గృహ నిర్భంధంలోనే ఉంచాల‌ని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.