ముగిసిన పోలింగ్ సమయం..
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/vote.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 6 గంటల నుండి క్యూలైన్‌లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. దీంతో రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సమయం ముగిసే సరికి దాదాపు 75 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
అంధ్రప్రదేశ్‌లో అనంతపురం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా హింసాత్మక ఘటనలుచోటు చేసుకున్నాయి. తాడిపత్రిలో జిల్లా ఎస్‌పిపైనే దాడి జరిగింది. తెనాలి ఘటన కలకలంరేపింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది.