వార‌ణాసి నుంచి ప్ర‌ధాని మోడీ నామినేష‌న్‌

హాజ‌రైన చంద్ర‌బాబు, ప‌వ‌న్ త‌దిత‌ర ఎన్డీయే నేత‌లు

వార‌ణాసి (CLiC2NEWS): ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌రుస‌గా మూడోసారి వార‌ణాసి నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ప‌లువు ఎన్డీయే నేత‌ల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ఉద‌యం జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీసులో ప్ర‌ధాని మోడీ నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి జాతీయ అధ్య‌క్షుడు జెపి న‌డ్డా, యుపి సిఎం యోగి ఆధిత్య‌నాథ్‌, టిడిపి అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌దిత‌రులు ప్ర‌ధాని వెంట రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యానికి వ‌చ్చారు.

దీనికి ముందు ప్ర‌ధాని కాశీలోని ద‌శాశ్వ‌మేధ ఘాట్ వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అలాగే సోమ‌వారం యుపి సిఎం యోగీతో క‌లిసి వార‌ణాసిలో భారీ రోడ్ షో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

కాగా ప్ర‌ధాని మోడీ ఇవాళ (మంగ‌శారం) ఉద‌యం `ఎక్స్‌` వేదిక‌గా ఒక ఎమోష‌న్ వీడియోను పోస్టు చేశారు. వార‌ణాసితో ఉన్న అనుబంధాన్ని ఆ విడియోలో ప్ర‌ధాని పంచుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.