రాజస్థాన్ గనిలో లిఫ్ట్ కూలి ఒకరి మృతి
జైపూర్ (CLiC2NEWS): రాజస్థాన్ లోని జాన్ ఝను జిల్లాలో ఉన్న కోలిహాన్ గనిలో లిఫ్ట్ కూలిపోయి ఒక విజిలెన్స్ అధికారి మరణించాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల మేరకు స్థానికంగా ఉన్న హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన కోలిహన్ గనిలో మంగళవారం రాత్రి లిఫ్ట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది విజిలెన్స్ అధికారులు గనిలో చిక్కుకు పోయారు. వారిలో 8 మందిని గనినుంచి బయటకు తీశారు. లిఫ్ట్‌లో ఉన్న మరో ఆరుగురిని సురక్షింగా బయటకు తీసుకు వచ్చారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం జైపూర్ ప్రభుత్వాసుప్రతికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ఒక అధికారి మరణించారు. మరో అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.