సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శన నిలిపివేత!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో 14 రోజుల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపి వేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శన నిలిపివేయనున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. అక్యూపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం భారీగా వస్తోందని ఈ సందర్భంగా యాజమన్యాలు తెలిపాయి. దీంతో సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల మూలంగానే స్వచ్ఛంధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.