తెలంగాణ‌లో ఎసిబికి చిక్కిన ముగ్గురు అధికారులు..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ‌లో వేర్వేరు చోట్లు ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ (ఎసిబి)కు ప‌ట్టుబ‌డ్డారు. భ‌ద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ట్రాన్స్‌కో ఎఇ శ‌ర‌త్‌కుమార్ .. ఓ రైతుకు ట్రాన్స్‌ఫార్మ‌ర్ మంజూరు చేయ‌డానికి రూ. ల‌క్ష లంచం అడిగాడు. లంచం తీసుకుంటుండ‌గా ఎసిబి అధికారుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు.

మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్ మండ‌ల వ్య‌వ‌సాయశాఖ అధికారి అనిల్ కుమార్ .. ఆగ్రో ఏజెన్సీ దుకాణం కోసం అనుమ‌తి కొర‌కు రూ. 30 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఎసిబి అధికారుల ప‌ట్టుకున్నారు.

న‌ల్గొండ జిల్లా చింత‌ప‌ల్లిలో విద్యుత్ శాఖ ఉద్యోగి వేణు బోరుకు విద్యుత్ క‌నెక్ష‌న్ ఇచ్చేందుకు రూ. 50 వేలు లంచం అడిగాడు . లంచం తీసుకుంటుండ‌గా ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.