అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ (30) దుర్మరణం పాలయ్యాడు. అతను ఎనిమిదేళ్లుగా యుఎస్‌లోని నార్త్ కరోలినాలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కిందటేడాది శ్రీప్రియతో వివాహం జరిగింది. బుధవారం ఇద్దరు కలిసి కారులో వెళుతుండగా.. ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ముందున్న కారును ఢీకొట్టింది. అది పల్టీలు కొట్టింది. తమ కారులో బెలూన్‌లు ఓపెన్ అవ్వడంతో వీరిరువురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం పోలీసులకు ఫోన్ చేయడానికి కారు దిగి ఫోన్ చేస్తుండగా.. వేగంగా వచ్చిన కారు పృథ్విరాజ్‌ను ఢీకొట్టింది. దాంతో ఆయన ఆక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.