అధిక వ‌డ్డీ ఆశ‌చూపి.. రూ. 200 కోట్లు వ‌సూలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో ఓ సంస్థ అధిక వ‌డ్డీ ఇస్తామ‌ని ఆశ‌చూపి ఏకంగా రూ. 200 కోట్లు వ‌సూలు చేసి మోసం చేసింది. అబిడ్స్‌లోని శ్రీ‌ప్రియాంక ఎంట‌ర్ ప్రైజెస్ 517 మంది నుండి రూ. 200 కోట్లు వ‌సూలు చేసి భారీ మోసానికి పాల్ప‌డింది. దీంతో బాధితులంతా బ‌షీర్‌బాగ్ సిసిఎస్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టినారు.

Leave A Reply

Your email address will not be published.