భారీ కుదుపులకు గురైన సింగపూర్ విమానం.. 5 నిమిషాల్లో 6వేల అడుగుల కిందకు

LONDON to SINGAPORE : లండన్ నుండి సింగపూర్‌కు వస్తున్న విమానం ఒక్కసారిగా 31 వేల అడుగుల నుండి 6 వేల అడుగుల కిందకు దూసుకెళ్లింది. దీంతో విమానం భారీ కుదుపులకు లోనై విమానం లోపల అల్లకల్లోలం అయ్యింది. ఒక్కసారిగా ఆకాశం నుండి కిందకు దూకినట్లుగా ఉంది. దీంతో అత్యవసరంగా బ్యాంకాక్‌లో విమానం ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా చెల్లాచెదురైపోయారు. ఒకరు మృతి చెందినట్లు సమాచారం. కొందరికి తీవ్ర గాయలయ్యాయి. విమానమంతా రక్తపు మరకలతో నిండిపోయింది.
లండన్ నుండి సింగపూర్‌కు 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బయల్దేరిన విమానం .. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకునేలోపు ఒక్కసారిగి 6వేల అడుగుల కిందకు దూసుకెళ్లింది. విమానంలోని ప్రయాణికులు ఎగిరిపడిపోతున్నారు. మాస్కులు, లైటింగ్, ఫ్యాన్ ప్యానెల్స్ సీలింగ్‌కు వేలడుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించింది.