కోల్‌క‌తా హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..

కోల్‌క‌తా (CLiC2NEWS): 2010 త‌ర్వాత నుండి రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన అన్ని ఒబిసి ధ్రువ‌ప‌త్రాల‌ను హైకోర్టు ర‌ద్దు చేసింది. 2010-12 మ‌ధ్య రాష్ట్ర ప్ర‌భుత్వం ఒబిసి వ‌ర్గీక‌ర‌ణ‌లుగా పేర్కొన్న 42 క్లాసుల‌ను కొట్టివేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆ వ‌ర్గీక‌ర‌ణ‌లు చ‌ట్ట విరుద్ధంగా ఉన్న‌య‌ని స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల ఆపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణం కేసులో 26 వేల మంది టీచ‌ర్ల ఉద్యోగాల‌ను హైకోర్టు ర‌ద్దు చేసింది.

2012 నాటి ప‌శ్చిమ బెంగాల్ వెన‌క‌బ‌డిన వ‌ర్గాల చ‌ట్టంలోని కొన్ని నిబంధ‌న‌లు చ‌ట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిష‌న్లు దాఖల‌య్యాయి. వీటిపై విచార‌ణ జ‌రిపిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం 2010 త‌ర్వాత ఒబిసి వ‌ర్గీక‌ర‌ణ‌లుగా పేర్కొన్న 42 క్లాసుల కింద జారీ చేసిన ఒబిసి స‌ర్టిఫికెట్ల‌న్నింటిని ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులిచ్చింది. ఈ క్లాసుల‌తో జారీ అయిన ఒబిసి ధ్ర‌వ‌ప‌త్రాల‌తో ఇప్ప‌టికే ప్ర‌యోజ‌నాలు పొందుతున్న‌వారు, ఆ రిజ‌ర్వేష‌న్ల కింద ఉద్యోగాలు చేస్తున్న‌వారిపై ఈ తీర్పు ఎలాంటి ప్ర‌భావం చూప‌ద‌ని న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. అంతేకాక 1993 నాటి వెన‌క‌బ‌డిన వ‌ర్గాల చ‌ట్టానికి అనుగుణంగా కొత్త ఒబిసి జాబితాను సిద్ధం చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.