మళ్లీ చాన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు.. కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో పదేళ్లలో లేని కరెంట్ కోతలను మళ్లీ చేస్తున్నామని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని.. మళ్లీ చాన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నట్లు ఆయన అన్నారు. సాగునీరు పంట పొలాలు ఎండిపోతున్నాయిన.. ట్రాక్టర్లు ఉండాల్సిన పొలాల్లో ట్యాంకర్లు కనిపిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎంజిఎం ఆసుపత్రిలో 5 గంటల విద్యుత్ కోత బాధాకరం అని.. ఆసుపత్రులను కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతుందన్నారు. ఆసపత్రుల్లో కరెంట్ కోతలకు ఎవరు బాధ్యత వహిస్తారని కెటిఆర్ ప్రశ్నించారు.
నీరులేక చెరువులు ఎండిపోతున్నాయన్నారు. రైతులకు పాత అప్పుకట్టాలని నోటీసులు వస్తున్నాయి. రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపుల కాయాల్సి వస్తోందని.. పదేళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని అన్నారు. విత్తనాల కోసం రైతుల మొక్కులు.. క్యూలైన్‌లో పాస్‌బుక్కులు చూస్తున్నామని.. ఇంకా కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాల్సివస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.