IPL: ఎలిమినేట‌ర్ మ్యాచ్.. బెంగ‌ళూరు vs రాజ‌స్థాన్

అహ్మ‌దాబాద్ (CLiC2NEWS): అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఐపిఎల్ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో హైద‌రాబాద్‌పై కోల‌క‌తా 8 వికెట్ల‌తో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరుకుంది. ఈ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఓడిపోయిన జ‌ట్టు ఇంటిబాట ప‌ట్టాల్సి వ‌స్తుంది. గెలిచిన జ‌ట్టు హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌తో త‌ల‌ప‌డుతుంది.

ఇక ఇవాళ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తుంది బెంగ‌ళూరు జట్టు. ఓపెన‌ర్లుగా డుప్లెసిస్‌, కోహ్లీ దిగారు. బెంగ‌ళూరు 37 ప‌రుగుల వ‌ద్ద డుప్లెసిస్ ఔట‌య్యాడు. విరాట్ కోహ్లీ 33 కామెరూన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 7.2 ఓవ‌ర్‌కు ఆర్‌సిబి 56 ప‌రుగులు చేసింది. 97 ప‌రుగులు చేసిన బెంగ‌ళూరు 12.3 ఓవ‌ర్‌కు గ్రీన్ ఔట‌య్యాడు . త‌ర్వాత వ‌చ్చిన మ్యాక్స్‌వెల్ గోల్డెన్‌డ‌క్‌గా వెనుదిరిగాడు. దీంతో బెంగ‌ళూరు జ‌ట్టు 97 ప‌రుగుల‌కు నాలుగు వికెట్లు కోల్పోయింది.

 

1 Comment
  1. […] IPL: ఎలిమినేట‌ర్ మ్యాచ్.. బెంగ‌ళూరు vs రాజ… […]

Leave A Reply

Your email address will not be published.