రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్ .. ఐదుగురు మృతి

ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్రలో ముంబయికి 40 కిలోమీటర్ల దూరంలో ఠానే లో భారీ పేలుడు సంభవించింది. డోబివిలి ఎంఐడిసి ఫేజ్-2 ప్రాంతంలోని అముదాన్ కెమికల్ కంపెనీలో గురువారం మధ్యాహ్నం ఓ పరిశ్రమలోని రియాక్టర్ పేలింది ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్ధం దాదాపు కిలోమీటరు మేర వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. పేలుడు ధాటికి చుట్టుప్రక్కల ఉన్న భవనాల అద్దాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇళ్లు సైతం దెబ్బతిన్నట్లు సమాచారం.
మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై సిఎం ఏక్‌నాథ్ శిండే స్పందించారు. క్షతగాత్రులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చినట్లు మంత్రి సమంత్ వెల్లడించారు. బాధితులకు వారం రోజుల్లోగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.