జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

అమరావతి (CLiC2NEWS): ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎపి హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202లో ఇవిఎంను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది.
ఇవిఎంల ధ్యంసం చేసిన ఘటన.. మాచర్ల ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం..