3 కి.మీ. మేర క్యూలైన్‌ల‌లో శ్రీ‌వారి భ‌క్తులు..

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల తిరుప‌తిలో ర‌ద్దీ నెల‌కొంది. శుక్ర‌వారం శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తుల‌తో తిరుమ‌ల జ‌న‌సంద్రంలా క‌నిపిస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయ‌ణ‌గిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోప‌స్ భ‌వ‌నం వ‌ర‌కు సుమారు 3 కిలోమీట‌ర్ల మేర భ‌క్తులు క్యూలైన్‌ల‌లో వేచి ఉన్నారు. వీరికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం 20 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. క్యూలైన్‌ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌కు తాగునీరు, అన్న‌ప్ర‌సాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ వారంతం వ‌ర‌కు ఇదే ర‌ద్దీ కొన‌సాగ‌తుండ‌వ‌చ్చ‌ని అధికారులు తెలుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.