30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో భారతీయ చిత్రం..

Cannes: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ‘కేన్స్’ ఉత్సవంలో భారతీయ చిత్రం కాంపిటీషన్లో ఉంది. పాయల్ కపాడియా దర్శకత్వంలో తెరకెక్కించిన మలయాళీ చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ .. కేన్స్ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్ డి ఓర్ ‘అవార్డుల కేటగిరిలో నిలిచింది. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రంను మే 23న ప్రదర్శించారు. ఈ సందర్బంగా రెడ్ కార్పెట్‌పై దర్శకరాలుతో పాటు చిత్ర బృందం రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. చిత్ర ప్రదర్శన పూర్తయిన అనంతరం టీమ్‌కు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.
మధ్యతరగతి యువతుల జీవితాలు, వారి భావోద్వేగాలతో ముడిపడిన’ ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ చిత్రం.. ముంబయి నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ. వీరు తమ తమ రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇద్దరు కలిసి ఓ బీచ్ టైన్‌కు రోడ్ ట్రిప్‌కు వెళ్లగా.. అక్కడ వారికి కన్పించిన అడవిలో ఏం జరిగిందనేది .. దాని వల్ల వారి జీవితాలు ఏవిధంగా మలుపుతిరిగాయి అన్నది చిత్ర కథాంశం.
2021లో పాయల్ కపాడియా తెరకెక్కించిన డాక్యెమెంటరీ ‘ఎనైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ కు ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు అందుకుంది. ఆమె దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ సినిమా ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ కేన్స్ ఉత్సవంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత్ నుండి పోటీలో నిలిచింది. గతంలో 1994 లో ‘స్వహం’ సినిమా ‘పామ్ డి ఓర్’ కేటగిరిలో పోటీ పడింది.