IPL: క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్థాన్ vs స‌న్‌రైజ‌ర్స్‌

IPL:  ఐపిఎల్ సీజ‌న్ 17లో శుక్ర‌వారం సాయంత్రం క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ జ‌ర‌గ‌బోతుంది. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ జ‌ట్టులు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సీజ‌న్‌లో ఈ రెండు జ‌ట్లూ ఒక్క మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. కేవ‌లం ఒక్క ప‌రుగు తేడాతో హైద‌రాబాద్ గెలిచింది.
ఈ సీజ‌న్ ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జ‌ట్లలో క్వాలిఫ‌య‌ర్‌-1లో కోల్‌క‌తా, హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌గా.. కోల్‌క‌తా విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో త‌రువాత స్థానంలో ఉన్న రాజ‌స్తాన్‌, బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది. ఇపుడు రాజ‌స్థాన్‌తో హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఫైన‌ల్‌లో కోల్‌క‌తాతో త‌ల‌ప‌డ‌నుంది.

IPL: క్వాలిఫ‌య‌ర్‌-2 కి రాజ‌స్తాన్ సిద్దం..

Leave A Reply

Your email address will not be published.