రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజ్‌లలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. దీనిపై ఉన్నత విద్యామడలి ఛైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రవేశాల కమిటి సమావేశమైంది. అనంతరం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. విద్యార్ధులు.. కౌన్సెలింగ్‌కు ముందే ఎస్ ఎస్‌సి , ఇంటర్ మార్కుల మెమోలు, టిసి, ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్దం చేసుకోవాలని సూచించారు.
- జూన్ 27వ తేదీ నుండి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- జూన్ 30వ తేదీ నుండి మొదటి విడత వెబ్ ఆప్షన్‌లకు అవకాశం
- జులై 12 తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- జులై 19 తేదీ నుండి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్
- జులై 24 తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు
- జులై 30 తేదీ నుండి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్
- ఆగస్టు 5 తేదీన తుది విడత సీట్ల కేటాయింపు
- ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు.
- ఆగస్టు 12 నుండి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ
- ఆగస్టు 16 తేదీన సీట్ల కేటాయింపు
- ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల